న్యూఢిల్లీ: పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ పేర్కొంది. ప్రభుత్వంపై చేసిన విమర్శలు రాజద్రోహంగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది. మంగళవారం తమపై జరిపిన దాడుల సందర్భంగా ఢిల్లీ పోలీసుల వైఖరిని తప్పుబట్టింది.
తమపై మోపిన ఆరోపణలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం కానీ, దానికి సంబంధించిన సమాచారం కానీ ఏమీ ఇవ్వకుండానే తమ కార్యాలయాలపై సోదాలు జరిపారని ఆరోపించింది.