ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.471.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు మైండ్‌ట్రీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.343.4 కోట్లతో పోలిస్తే 37 శాతం అధికమని పేర్కొంది.
ఐటీసీ నికర లాభం 30.24 శాతం పెరిగింది. సిగరెట్ ఆదాయం రూ.5,802.67 కోట్ల వరకు పెరిగింది. ఐటీసీ లిమిటెడ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.