రెండ్రోజులపాటు భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేణా తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం 9గంటల వరకు గరిష్టంగా 50.50 అడుగులకు చేరుకున్న నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతున్నది.
ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి రవాణాశాఖమంత్రి