గూఢచర్యం ఆరోపణలపై ఖతార్‌లో అరెస్ట్ అయిన 8 మంది భారత నావికాదళ మాజీ అధికారులకు విముక్తి లభించింది. వారి శిక్షను ఖతార్ ప్రభుత్వం రద్దు చేసి విడుదల చేసింది. వీరిలో ఏడుగురు సోమవారం ఉదయం భారత్ చేరుకున్నారు.
భారత నౌకాదళంలో పనిచేసిన 8 మంది మాజీ సిబ్బందికి ఖతర్‌లోని ఓ కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ దాఖలు చేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చీ చెప్పారు.