క్యూబా పోరాటయోధుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైద గువేరా, మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరిగే సభలో పాల్గొననున్నారు.
రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి బరితెగించి తూట్లు పొడుస్తున్న బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పిలుపునిచ్చారు.