దేశంలో అతిపెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థల్లో ఒకటైన ముత్తూట్ మైక్రోఫిన్..తెలంగాణలోకి అడుగుపెట్టింది. తొలి విడుత ఈ నెలలోనే నాలుగు శాఖలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది.
రుణాలపై వడ్డీరేట్లను 55 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది ముత్తూట్ మైక్రోఫిన్. కొత్తగా తీసుకునే రుణాలతోపాటు పాత వాటికి కూడా ఈ తగ్గింపు వర్తించనున్నదని పేర్కొంది.