Muthoot Finance | హైదరాబాద్, మార్చి 15: దేశంలో అతిపెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థల్లో ఒకటైన ముత్తూట్ మైక్రోఫిన్.. తెలంగాణలోకి అడుగుపెట్టింది. తొలి విడుత ఈ నెలలోనే నాలుగు శాఖలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా వ్యాపార విస్తరణలో భాగంగా ఈ నెలలోనే భువనగిరి, జనగాం, హన్మకొండ, పరకాలలో నాలుగు శాఖలను ప్రారంభించనున్నట్లు కంపెనీ సీఈవో సదాఫ్ సయ్యద్ తెలిపారు. త్వరలో ఏపీ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించారు.