ముంబై నగర పాలిక ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరుకున్న వేళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైని బంగ్లా దేశీయులు, రొహింగ్యాలు లేని నగరంగా చేస్తామని ప్రకటించారు.
ఈ నెల 15న జరుగనున్న ముంబై మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తమదేనని నమ్ముతున్న మహాయుతి కూటమి దీని ప్రభావంతో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్నది.
త్వరలో జరగబోయే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు సీట్ల పంపకంపై ఒప్పందం కుదుర్చుకోవడంతో కేంద్ర మంత్రి, ఆర్పీఐ(ఏ ) పార్టీ చీఫ్ రామ్‌దాస్ అథవాలే మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ‘నమ్�