ముంబై : త్వరలో జరగబోయే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు సీట్ల పంపకంపై ఒప్పందం కుదుర్చుకోవడంతో కేంద్ర మంత్రి, ఆర్పీఐ(ఏ ) పార్టీ చీఫ్ రామ్‌దాస్ అథవాలే మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ‘నమ్మకద్రోహం’గా ఆయన అభివర్ణించారు.
బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో 137-90 సీట్ల చొప్పున పోటీ చేయాలని అధికార బీజేపీ, ఏక్నాథ్ షిండేల మధ్య సోమవారం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం నుంచి తమ పార్టీని మినహాయించడం పట్ల అథవాలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇది కచ్చితంగా నమ్మకద్రోహమే. పార్టీ కార్యకర్తలు తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా నా మద్దతు ఉంటుంది’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.