భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల సీఎం కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దికును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంఎస్ స్వామినాథన్ ఆధునిక వ్యవసాయ మార్గదర్శకుడని, దేశానికే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.