ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు చాటేలా పూజారుల ఆలోచనల మేరకే గద్దెల ప్రాంగణంలో మార్పులు లేకుండా మేడారం ఆధునీకరణ పనులను చేపడుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
జంపన్న వాగులో నాణేల వేట మొదలైంది. భక్తులు పుణ్యస్నానాలు చేసే సమయంలో వాగులో నాణేలు వేయడం ఆనవాయితీ. వాటిని సేకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తాళ్లకు అయస్కాంతం కట్టి వెతకం కనిపించింది.