మాంసపు బియ్యం ఏంటి అనుకొంటున్నారా? ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన గోవు మాంస కణాల్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్ చేసి.. సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా సైంటిస్టులు సృష్టించారు.
Non veg rice | ఆహారం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకొనేవారికి శుభవార్త. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రీడ్ నాన్వెజ్ రైస్ (మాంసం బియ్యం)ని సృష్టించారు.