Non veg rice | నాన్ వెజ్ రైస్.. సాధారణ బియ్యం కంటే 8 శాతం ప్రొటీన్లు, 7 శాతం కొవ్వు అధికం..!
Non veg rice | ఆహారం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకొనేవారికి శుభవార్త. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రీడ్ నాన్‌వెజ్ రైస్ (మాంసం బియ్యం)ని సృష్టించారు.
సియోల్, ఫిబ్రవరి 16: ఆహారం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకొనేవారికి శుభవార్త. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రీడ్ నాన్‌వెజ్ రైస్ (మాంసం బియ్యం)ని సృష్టించారు. ఈ బియ్యంలో పశు మాంసం, కొవ్వు కణాలుండేలా ప్రయోగశాలలో సాగు చేస్తారు. ఇందుకోసం ముందుగా బియ్యానికి చేపల నుంచి తీసిన జిగురు లాంటి పదార్థాన్ని పూస్తారు. దీనివల్ల పశు మాంస కణాలు దానికి అతుక్కుపోతాయి. తర్వాత వాటిని 11 రోజుల పాటు ఒక పాత్రలో సాగు చేస్తారు.
సాధారణ బియ్యం కంటే 8 శాతం ప్రొటీన్లు, 7 శాతం కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇవి అందుబాటులో ధరలో, పర్యావరణ హితంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మేటర్ జర్నల్ కథనం ప్రకారం కరువు, సైనిక రేషన్, అంతరిక్ష ఆహారంగా ఈ నాన్‌వెజ్ రైస్‌ని వాడుకోవచ్చు. ప్రయోగశాలలో తయారయ్యే ఈ బియ్యం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, మాంసం కోసం పశువుల్ని పెంచే అవసరం తప్పుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ రకంగా ఇవి పర్యావరణ హితమైనవని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ బియ్యాన్ని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

