తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎవరైనా విమానాన్నే ఎంచుకుంటారు. కానీ ఇటీవల విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.
విమానంలో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలం. రైల్లో అయితే 100 కిలోమీటర్లే ఎక్కువ. అయితే, చైనాలో త్వరలో అందుబాటులోకి రానున్న వినూత్న రైళ్లు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవట.