బీజింగ్: చైనాకు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు అద్భుతం సృష్టించారు. అత్యంత వేగవంతమైన సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేశారు. ఒక టన్ను బరువున్న టెస్ట్ వాహనాన్ని కేవలం 2 సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టించి అద్భుతం చేశారు.
400 మీటర్ల పొడవైన మాగ్లెవ్ ట్రాక్‌పై ప్రయోగం జరపగా, 1000 కిలోల బరువుగల టెస్ట్ వాహనం అద్భుతమైన వేగాన్ని అందుకుంది. తాజా ప్రయోగం పాత రికార్డును (గంటకు 648 కిలోమీటర్ల వేగం)ను అధిగమించింది. చైనా సాధించిన ఈ విజయం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీయనున్నది.