విమానం కన్నా వేగం!.. గంటకు 600 కి.మీ వేగంతో ప్రయాణించే రైలు
తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎవరైనా విమానాన్నే ఎంచుకుంటారు. కానీ ఇటీవల విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.
బీజింగ్, జూలై 14: తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎవరైనా విమానాన్నే ఎంచుకుంటారు. కానీ ఇటీవల విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. దీంతో ఆలస్యమైనా సరే రైలు ప్రయాణమే ఉత్తమమని చాలామంది భావిస్తున్నారు. కానీ రైలులోనే విమానమంత వేగంగా ప్రయాణించే అవకాశం లభిస్తే! చైనా ఆ కలను సాకారం చేసి చూపించింది. గంటకు 600 కిలోమీటర్లు ప్రయాణించే రైలును ఆవిష్కరించింది. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) సాంకేతికతతో రూపొందించిన రైలును ఇటీవల పరీక్షించింది.
ఈ రైలు 150 నిమిషాల్లో 1,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. కొన్ని రకాల విమానాల వేగం కన్నా ఈ రైలు అత్యధిక వేగాన్ని నమోదుచేసింది. ఇటీవల నిర్వహించిన 17వ మాడర్న్ రైల్వేస్ ఎగ్జిబిషన్లో ఈ రైలును ఆవిష్కరించారు.
ఈ రైలు కేవలం ఏడు సెకన్ల వ్యవధిలో 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంటే బీజింగ్, షాంఘై మధ్యనున్న 1,200 కిలోమీటర్ల దూరాన్ని ఈ మాగ్లెవ్ రైలు కేవలం రెండున్నర గంటల్లో (150 నిమిషాలు) అందుకుంటుందని దానిని రూపొందించిన చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. విమానాలు గంటకు 547 మైళ్ల వేగంతో వెళ్తే.. ఈ రైలును 2023లో పరీక్షించినప్పుడు 620 మైళ్ల వేగాన్ని అందుకున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

