తెలుగు కవిత్వంలో మానవీకరణ తరచుగా కనిపిస్తుంది. ఈ ఉదాహరణలు చూడండి. ‘అక్కడ నిశ్శబ్ద సంగీతమేదో ఆలపిస్తోంది’ - యెన్నం ఉపేందర్, ‘ఈ కవిత్వం వెళ్ళిపోయి / నాలో నన్ను మిగలకుండా చేసింది.
ఆంగ్ల సాహిత్య విమర్శలో అలెగరి(allegory)కి ప్రముఖ స్థానం ఉన్నది. ఆ భాషలో ఉన్న వందకుపైగా సాహిత్య సాధనాలలో (literary devices) ఇదొకటి. తెలుగులో దీనిని ధ్వన్యాత్మక రచన లేదా నిగూఢార్థ రచన అనవచ్చు. బాగా సరిపోయే సమానార్థకమైన అచ్చ