దేశంలో 2029 నుంచి లోక్‌సభతోపాటే అన్ని రాష్ర్టాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సిఫారసు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో వచ్చే వారం లా కమిషన్ భేటీ కానుంది. ఈ నెల 25న జమిలి ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను కమిటీకి సమర్పించనుంది.