Jamili Elections | 2029 నుంచి జమిలి ఎన్నికలు.. లోక్‌సభతోపాటే అన్ని రాష్ర్టాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు!
దేశంలో 2029 నుంచి లోక్‌సభతోపాటే అన్ని రాష్ర్టాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సిఫారసు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ మేరకు రాజ్యాంగంలో ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అనే కొత్త అధ్యాయాన్ని చేర్చేందుకు ప్రతిపాదనలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
- ప్రతిపాదించనున్న లా కమిషన్
- ఏకకాల ఎన్నికలపై రాజ్యాంగంలో కొత్త చాప్టర్ చేర్చే యోచన
Jamili Elections | న్యూఢిల్లీ: దేశంలో 2029 నుంచి లోక్‌సభతోపాటే అన్ని రాష్ర్టాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సిఫారసు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ మేరకు రాజ్యాంగంలో ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అనే కొత్త అధ్యాయాన్ని చేర్చేందుకు ప్రతిపాదనలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. 2029లో మే, జూన్ మధ్య కాలంలో ఎన్నికలు నిర్వహించేలా లా కమిషన్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయని సంబంధిత వర్గా లు బుధవారం తెలిపాయి.
లా కమిషన్‌తో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా రాజ్యాంగాన్ని, ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను మార్చటం ద్వారా జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించవచ్చో అనే దానిపై నివేదికను రూపొందిస్తున్నది. ఈ ఏడాది మేలో లోక్‌సభతో పాటు ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే అవకాశమున్నది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ర్టాల్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళకు 2026లో, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్లకు 2027లో ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ర్టాల్లో 2028లో ఎన్నికలు జరగవచ్చు. జస్టిస్ రీతురాజ్ అవస్తీ ఆధ్వర్యంలోని లా కమిషన్, ఏకకాల ఎన్నికలపై కొత్త అధ్యాయాన్ని చేర్చటానికి రాజ్యాంగ సవరణకు సిఫారసు చేయవచ్చని సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

