యాదగిరిగుట్ట ప్రధానాయలంలో లక్ష్మీనరసింహులకు నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు.
పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి భాగంగా లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. తుల లగ్న పుష్కరాంశ సుముహూర్తమున నారసింహుడు అమ్మవారి మెడలో మాంగల్యధారణ చేసే అపూర్వ ఘట్టాన�