కొండగాలి తగిలితే.. మేఘం వర్షిస్తుంది. మెట్ట పరవశిస్తుంది. అదే కొండపల్లి చేయి కదిపితే.. వన్నెలు పులకిస్తాయి. వెన్నెల్లు విరుస్తాయి. ఆయన కుంచె నుంచి ఉదయించిన ప్రతి చిత్రమూ అపురూపమే! ఆయన రంగులద్దిన ప్రతి గీతా.
సుమారు అయిదు దశాబ్దాల కిందట అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ తన రూపాన్ని తానే స్కెచ్ వేసుకుని పై కవితను రచించారు ప్రముఖ చిత్రకారులు స్వర్గీయ డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు.