నాడు కన్న కలలు నేడు నిజమవుతున్నాయని.. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు ఒక్కొక్కటిగా అన్నీ చేసుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని కోమటి చెరువు మరో అద్భుత ఘట్టానికి వేదికైంది. ఆదివారం 450 డ్రోన్లతో సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా మెగా డ్రోన్ షో జరుగనున్నది.