చాలెంజ్‌గా తీసుకుంటే సాధించలేనిదేమీ లేదని, ఉద్యోగులు, సిబ్బంది తమ విధులు బాధ్యతగా నిర్వర్తిస్తే ఆర్టీసీ అన్ని విధాలా ముందుకెళ్తుందని ఆ సంస్థ ఈడీ పురుషోత్తం అన్నారు.
మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రభుత్వం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య రెండింతలు పెరిగింది. బస్సులు కెపాసిటీకి మించి వెళ్తున్నాయి.
మహాలక్ష్మీ పథకం ప్రారంభానికి ముందు బస్సుల్లో 45 నుంచి 60 మంది ప్రయాణించేవారని ఆ సంఖ్య గణనీయంగా పెరిగి డీజిల్ వాడకంలో తేడా, టైర్లపై భారం, కమాన్‌పట్టీలు ..విరగడం, బస్సుల మెయింటనెన్స్ విపరీతంగా పెరిగిందని అద