మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం వ్యాయామం చేయడం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా తినాల్సి ఉంటుంది. కొందరు వ్యాయామం అయితే చేస్తారు కానీ అనారోగ్యకరమైన ఆహారాలను తింటారు.
రాజ్మా.. వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. చూసేందుకు అచ్చం ఇవి కిడ్నీల మాదిరిగానే ఉంటాయి. కనుకనే ఈ బీన్స్‌ను ఆ పేరుతో పిలుస్తారు. రాజ్మాను ఎక్కువగా ఉత్తరాదికి చెందిన వారు తింటారు.