దేవరకొండ మండలంలోని వైదొనివంపు గ్రామం కీర దోస సాగుకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. గ్రామంలో 10 మంది రైతులు సంప్రదాయ పంటలు కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే కీర సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు.
ఔషధ గుణాల కీరదోస.. కర్షకుల గోస తీరుస్తున్నది. ఆహార పంటగానే కాదు.. వాణిజ్య పంటగానూ విరివిగా సాగవుతున్నది. తక్కువ రోజుల్లోనే చేతికి వస్తూ.. రైతులను లాభాల బాట
పట్టిస్తున్నది. దీనికి మార్కెట్లో ఏడాదంతా గిరాకీ