Keera Dosha Benefits | అధిక బరువు తగ్గాలంటే.. ఈ జ్యూస్ తాగితే సరి..!
Keera Dosha Benefits | కీరదోస కాయ జ్యూస్ వరుసగా ఐదు రోజుల పాటు తాగడం వల్ల అధిక బరువు తగ్గడంతోపాటు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుందని చెబుతున్నారు.
Keera Dosha Benefits | జీవనశైలిలో మార్పులు.. తగ్గిన శారీరక శ్రమ.. నిద్ర వేళల్లో తేడాలు.. ఉద్యోగ టెన్షన్లు.. తదితర కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కరించుకోవడానికి తేలికైన మార్గం ఉందని చెబుతున్నారు. కీర దోస జ్యూస్ సరైన పరిష్కారం అంటున్నారు.
కీర దోస కాయలతో జ్యూస్ చేయడానికి వాటిని ముక్కలుగా కట్ చేయాలి. అయితే, వాటిని కట్ చేస్తున్నప్పుడు తొక్కలు తీయొద్దు. తొక్కలోనూ పలు రకాల పోషకాలు ఉంటాయి. ఈ ముక్కలు మిక్సీ జార్లో వేసి, కొన్ని కరివేపాకు ఆకులు, నీరు పోసి మిక్స్ చేసి గ్లాస్ లో తీసుకోవాలి. తాగే ముందు నిమ్మకాయలో సగం చెక్క రసం, కొంచెం జీలకర్ర పొడి కలిపి తాగాలి. ప్రతి రోజూ ఉదయం ఈ జ్యూస్ తాగొచ్చు. ఎప్పుడు తాగినా అంతకు ముందు రెండు గంటల పాటు కడుపు ఖాళీగా ఉండాలన్న సంగతి మరిచిపోవద్దు. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించేస్తుంది. శరీరం బరువు కూడా చాలా వేగంగా తగ్గిపోతుంది కూడా.
కీర దోసలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఈ జ్యూస్ తాగినప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువగా ఉండటంతోపాటు తొందరగా ఆకలి కాదు. దీంతో తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. వేసవిలో కీర దోస ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో కీర దోస తినడం గానీ, జ్యూస్ గానీ తీసుకుంటే డీ హైడ్రేషన్ సమస్య తగ్గుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

