కంచ గచ్చిబౌలిలోని హెచ్సీయూ భూముల్లో చెట్ల నరికివేతపై కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆగ్రహంతో ఉందన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది.
కంచ గచ్చిబౌలిలోని భూముల్లో పనులు నిలిపివేత ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించింది. అప్పటివరకు సదరు భూముల్లోని చెట్ల నరికివేత కొనసాగించరాదని గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.