ప్రభుత్వానికి, రాజ్యాంగ ధర్మాసనాలైన కోర్టులకు హైడ్రా అతీతమా? ప్రభుత్వానికి సమాంతరంగా హైడ్రా పాలన సాగిస్తున్నదా? కోర్టుల కంటే తామే అధికమని హైడ్రా అనుకుంటున్నదా? అని రాష్ట్ర హైకోర్టు నిప్పులు చెరిగింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45-టీ జంక్షన్ నుంచి దుర్గంచెరువు వరకు రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన నాలుగు ప్రైవేట్ ఆస్తుల భూసేకరణ ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది.