పూర్వకాలంలో చాలా మందికి జొన్నలే ప్రధాన ఆహారంగా ఉండేవి. తెల్ల అన్నాన్ని ఎప్పుడో పండుగలు, శుభ కార్యాల సమయంలోనే తినేవారు. జొన్నలను రోజూ తినేవారు కనుకనే ఒకప్పుడు ప్రజలు అంత ఆరోగ్యంగా ఉండేవారు.
వర్షాధార ప్రాంతాల ప్రజల ఆహారంలో జొన్నలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కేవలం నీళ్లు మాత్రమే కలిపి చేసే జొన్నరొట్టె తెలంగాణ, ఉత్తర కర్ణాటక లాంటి వర్షపాతం తక్కువగా కురిసే ప్రదేశాల్లో రోజువారీ ఆహారం.