Supreme Court | యెమెన్ (Yemen) లో మరణశిక్ష (Death sentence) ను ఎదుర్కొంటున్న భారత నర్సు నిమిష ప్రియకు శిక్ష అమలుపై స్టే కొనసాగుతున్నదని గురువారం కేంద్ర ప్రభుత్వం (Union Govt) సుప్రీంకోర్టు (Supreme Court) కు తెలియజేసింది.
కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు ఈ నెల 16న యెమెన్ ప్రభుత్వం ఉరి శిక్షను అమలు చేయబోతున్నది. ఆమె యెమెన్ జాతీయుడిని హత్య చేసినట్లు నిర్ధారించి, ఆమెకు కోర్టు మరణ శిక్ష విధించింది.