మాద్వి హిడ్మా.. ఇమ్మడి రవి.. ఇద్దరూ ఒకటి కాదు. భిన్న స్వభావాలు, విభిన్న కార్యాలు. ఒకరిది అలుపెరగని రక్త చరిత్రైతే.. ఇంకొకరిది అంతులేని పైరసీలో కీలక పాత్ర.
ఐబొమ్మ పేరుతో సిని మా పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు నిర్వహిస్తున్న ఇమ్మడి రవి దేశ డిజిటల్ భద్రతకు హానికరమని పోలీసులు పేర్కొన్నారు. రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు.