హైడ్రా.. ఇదో మెదడు లేని చేతనం. ఆకలి తప్ప, ఆలోచన లేని జలచరం. నాడీకణం కమాండ్తో కదిలే హైడ్రోజోవా జీవి. మేత వేస్తే రూపం మార్చుకుంటుంది. శత్రువు ఎదురుపడితే దూరంగా పారిపోతుంది.
విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పనితీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతున్నది.