మండలంలోని ఎరడపల్లి శివారులోని ఓ రైతు పొలంలో శేష శయనుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి శిల్పం బయటపడింది. చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి శుక్రవారం ఈ శిల్పాన్ని గుర్తించి, వివరాలు వెల్లడించారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంలో నాగులమ్మ గుడికి మరమ్మతులు చేస్తుండగా సూర్యుడి విగ్రహం, 13వ శతాబ్దం నాటి శిలాశాసనం, మట్టి, డంగు సున్నం లేకుండా గోడ నిర్మించగల ఇటుకలు బయటపడినట్టు చరిత్ర పర�