యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ తదితర సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ ఒక సరికొత్త ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం సోమవారం లోక్సభలో వెల్లడించింది.
దేశంలోని ఉన్నత విద్య మొత్తాన్ని ఒకే సంస్థ పరిధిలోకి తేవాలన్న లక్ష్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాదే ఆచరణలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.