ఒక ఊర్లో తిరునాళ్లకు హరికథ ఏర్పాటు చేశారు. హరికథ చెప్పడానికి ప్రముఖ భాగవతార్ తన బృందంతో వచ్చాడు. ‘పాండవ వనవాసం’ కథను అందుకున్నాడు. అప్పుడప్పుడూ కథకుడు ‘గోవింద’లు చెబుతున్నాడు.
తెలుగు వారికే సొంతమైన హరికథలను పరిరక్షించుకొని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు.