రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇటు రుతుపవనాలు, అటు అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావంతో ఈ వానలు పడుతాయని తెలిపింది.
యాసంగి పంటలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది.