నిరుపేదలందరికీ గృహలక్ష్మి పథకం వరంలాంటిదని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. సొంతింటి కల సాకారమైన వారంతా సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఈ పథకం కింద జాగ ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అంది