నీటి కరువుతో చేతికొచ్చిన పంట పశువులకు మేతగా మారుతున్న ది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో భూగర్భజలాలు పాతాళానికి చేరి.. బోర్లు వట్టిపోయి ఎండిపోతుండడంతో అన్నదాత కంట కన్నీరు వస్తున్నది.
రోడ్డుపై ఊడిపోయిన నీటి పైపు వద్ద కనిపిస్తున్న ఈ రైతు పేరు జెల్ల కుమార్. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లికి చెందిన ఆయన, సొంత ఎకరం భూమితోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి వేశాడు.