ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో వరి ధాన్యం దండిగా పండింది. మొత్తం 508 కేంద్రాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టగా, ఇటీవలే ప్రక్రియ ముగిసింది. గత సీజన్కంటే లెక్కకు మించి దిగుబడి వచ్చింది.
రైస్ మిల్లింగ్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మూడు సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇంకా అందించకపోవడంతో ప్రభుత్వం కన్నెర్ర చేసింది.