రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనున్నది. ఒక్కో తరగతి పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనున్నది. పాఠ్యపుస్తకాల ముద్రణను వినియోగించే పేపర్ మందం తగ్గడమే ఇందుకు కారణం.
సర్కారు బడులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్లను తరలించేందుకు చెల్లించే రవాణా చార్జీలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జిల్లాకు రూ. 2 లక్షల చొప్పున 33 జిల్లాలకు రూ.66 లక్షల నిధులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్