స్కాన్ చెయ్.. పాఠాలు చూసెయ్..
తరగతి గదిలో పాఠం చెప్పే సందర్భంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. కొందరు అకడికకడే వాటిని నివృత్తి చేసుకుంటారు.
- అరచేతిలో ఆడియో, వీడియో రూపంలో ప్రత్యక్షం
- ప్రభుత్వ పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్
- ప్రతి పాఠం సాన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే సౌలభ్యం
- అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ సరారు
తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కాక కొందరు.. సందేహాలు అడిగేందుకు భయపడి నివృత్తి చేసుకోలేక ఇంకొందరు.. అసలు ఆ రోజు బడికి వెళ్లక పాఠాలు మిస్సయి చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. కానీ వీటన్నింటికీ పరిష్కారం చూపేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం క్యూఆర్ కోడ్‌ను ముద్రించిన పుస్తకాలను అందజేసింది. ఇక స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే చాలు.. మీకు కావాల్సిన పాఠ్యాంశం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఇలా మీకు కావాల్సినప్పుడు, అర్థమయ్యేదాకా పాఠాలను వినొచ్చు, చూడవచ్చు. ఎలాంటి సందేహాలనైనా నివృత్తి చేసుకోవచ్చు.
– ములుగు టౌన్, జనవరి 3
ములుగు టౌన్, జనవరి 3 : తరగతి గదిలో పాఠం చెప్పే సందర్భంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. కొందరు అకడికకడే వాటిని నివృత్తి చేసుకుంటారు. మరికొందరు అడిగేందుకు సంకోచిస్తుంటారు. ఇలా ఇబ్బందులు పడే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఇస్తోంది. ఈ విధానంతో పాఠ్యాంశాన్ని మరోసారి వినే అవకాశం ఉంటుంది. డిజిటల్ విధానంలో పాఠాన్ని పునఃశ్చరణతో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒకప్పుడు పాఠ్యాంశాన్ని విన్న తర్వాత సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు చాలా సమయం పట్టేది. ఒకవేళ బడికి వెళ్లకపోతే ఆ రోజు పాఠాలు విద్యార్థి కోల్పోయినట్లే. ఇకపై విద్యార్థులకు ఆ ఇబ్బంది ఉండదు. ఆ రోజు తరగతి గదిలో చెప్పిన పాఠ్యాంశం ఇంటికి వెళ్లిన తర్వాత పాఠ్యపుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా తిరిగి వినే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఒకో పాఠానికి రెండు క్యూఆర్ కోడ్లు
గతంలో పాఠ్యపుస్తకంలో మొదటి, చివరి పేజీల్లో మాత్రమే క్యూఆర్ కోడ్ ఉండేది. ప్రస్తుతం పుస్తకంలోని ప్రతి పాఠ్యాంశంలో రెండు క్యూఆర్ కోడ్లు ముద్రించారు. పాఠం ప్రారంభంలోని కోడ్‌ను స్కాన్ చేస్తే పాఠ్యాంశ విషయం పట్ల అవగాహన వస్తుంది. అలాగే సామర్థ్యాల సాధనకనువైన సూచనలు లభిస్తాయి. ఇక రెండో క్యూఆర్ కోడ్ ‘ఇవి చేయండి’ అనే శీర్షిక వద్ద ఉంటుంది. వీటిలో అదనపు ప్రశ్నలు, కృత్యాలు వంటివి ఉంటాయి. వీటి ద్వారా విద్యార్థులకు అభ్యసన ఫలితాలకు అణుగుణంగా అభ్యాసం కల్పించవచ్చు. దీంతో విద్యార్థి తనకు కావాల్సిన పాఠ్యాంశాన్ని స్మార్ట్‌ఫోన్‌తో చకగా డిజిటల్ పాఠాలను వినడంతోపాటు చూడవచ్చు. మొదట్లో దీక్ష ఆప్ డౌన్లోడ్ చేసుకుంటే పాఠం వినే అవకాశం ఉండేది. ఇప్పుడు నేరుగా గూగుల్ లెన్స్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాఠ్యాంశాలు వినవచ్చు. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలపై ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌ను ముద్రించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందజేసింది.
సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇలా..
మొదట స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ లెన్స్ సాయంతో పాఠ్యాంశంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. మనకు కావాల్సినప్పుడల్లా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అవసరమైతే ఆ పాఠం అర్థమయ్యే వరకూ వినవచ్చు, చూడవచ్చు. ఇలా కావాల్సిన పాఠాన్ని స్కాన్ చేస్తే చాలు దృశ్యరూపంలో కనిపిస్తుంది. దీనిపై చాలామంది విద్యార్థులకు అవగాహన లేదు. ఉపాధ్యాయులు కూడా దీనిపై మరింత అవగాహన కల్పిస్తే మెరుగైన సత్ఫలితాలు వస్తాయని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. విద్యాబోధనలో మార్పులకు అనుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకునేందుకు విద్యాశాఖ ఈ విధానం అందుబాటులోకి తెచ్చింది.
ఆసక్తిగా ఉంది
క్యూఆర్ కోడ్ సాన్ చేసి పాఠం మళ్లీ వినడం వల్ల వీడియో రూపంలో చూడడం కొత్తగా, ఆసక్తిగా ఉంది. తరగతి గదిలో టీచర్ చెప్పిన పాఠం అర్థం కాకపోతే ఇదివరకు గందరగోళానికి గురయ్యేవాళ్లం. అర్థం కాలేదని మరోసారి టీచర్‌ను అడుగుదామంటే ఏమంటారో అని భయం వేసేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. క్యూఆర్ కోడ్‌తో అర్థమయ్యే వరకు వినవచ్చు, చూడవచ్చు.
– బి.రాధిక, పదో తరగతి
పునఃశ్చరణలో ఉపయోగం
విద్యార్థులకు పునఃశ్చరణ సమయంలో క్యూఆర్ కోడ్ చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులు క్యూఆర్ కోడ్‌తో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వీడియో రూపంలో పాఠాలు వినడం వల్ల తొందరగా అర్థమవుతాయి. ఎకువ కాలం గుర్తుంటాయి.
– వీ.భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయురాలు
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

