న్యూఢిల్లీ : గవర్నర్ల వ్యవహార శైలిపై ప్రతిపక్ష పాలిత రాష్ర్టాలలో వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తమవుతుండగా పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి గవర్నర్ రాష్ర్టానికి బాస్ కారంటూ పిల్లల పాఠ్యపుస్తకాలలో ఓ అధ్యాయాన్ని చేర్చి ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ఆయనకు ముందు ఉన్న ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పట్ల తన అసమ్మతిని వినూత్నంగా తెలియచేసింది.
10వ తరగతి సోషల్ సైన్స్‌లో గవర్నర్ అధికారాలు, విధులపై కేరళ ప్రభుత్వం బుధవారం ఓ మాడ్యూల్‌ని చేర్చింది. గవర్నర్ ప్రజల చేత ఎన్నిక కాని ఓ నామమాత్ర వ్యక్తని, అసలైన అధికారాలు ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గానికే ఉంటాయని ఈ మాడ్యూల్లో ప్రభుత్వం అభివర్ణించింది.