కార్మికులు 8 గంటలకు బదులుగా 10 గంటలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 282 జీవోను రద్దు చేయాలని బీఆర్టీయూ డిమాండ్ చేసింది. రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది.
తమను విధుల్లోకి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలతో ఉద్యమిస్తామని ఆర్టీసీ సస్పెండెడ్, రిమూవ్డ్ ఎంప్లాయీస్ ప్రతినిధి యలమర్తి ప్రసాద్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.