సిక్కిం వరదల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం కుమ్మన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్ నీరడి గంగాప్రసాద్‌కు ఆదివారం గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
భారత - చైనా సరిహద్దులో విధి నిర్వహణ పూర్తి చేసుకుని పశ్చిమబెంగాల్లోని తమ క్యాంప్‌నకు తిరుగుప్రయాణంలో వరదల్లో సైనిక అధికారులు, సైనికులు గల్లంతైన విష యం తెలిసిందే.