అమెరికాలో దుండగుల కాల్పుల్లో మరణించిన గంప ప్రవీణ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రవీణ్ కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు.
Rangareddy | అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఈ నెల 5న మృత్యువాత పడ్డ గంప ప్రవీణ్ (Gampa Praveen)పార్థివ దేహం ఆదివారం మృతుని స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చేరుకుంది.