ప్రధాని మోదీ, బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ కొడుకు, విశాఖ ఇండస్ట్రీస్ అధినేత వంశీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఓ సారూ.. మా సర్కారు తడి సిన వడ్లు కొంటాన్నది కదా? మల్ల నువ్వు గిక్కడి కెందుకచ్చినవ్? ఇందుల మల్ల బీజేపీ రాజకీయం జేసుడేంది?’ అంటూ రైతన్నలు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్‌పై తిరగబడ్డారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్‌పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. ఆయన వ్యవహారశైలిపై పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్నిస్థాయిల నేతలు భగ్గుమంటున్నారు.