ఉస్మానియా యూనివర్సిటీ 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు శుక్రవారం ఠాగూర్ ఆడిటోరియంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ‘ఉస్మానియా తక్ష్ - 2024’లో భాగంగా వర్సిటీలోని అన్ని కళాశాలలు, విభాగాలలో ఓపెన్ డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలను సర్వాంగ సుందరంగా