దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మనోవేదనకు గురైన ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామంలో చోటుచేసుకున్నది.
పంటలు చేతికి రాక.. అప్పుల బాధ భరించలేక రైతులు తనువు చాలిస్తున్నారు. ఈ మధ్య పదుల సంఖ్యలో రైతులు బలవన్మరణం చెందారు. తాజాగా జనగామ జిల్లాలో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.