రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆల య ఖజానా ఖాతా లో జమైన రైతు ఏదుల సత్తెమ్మకు చెందిన పత్తి డబ్బులు రూ.2,14,549 ఆలయ అధికారులు తిరిగి ఆమె ఖాతాకు బదిలీ చేయించారు.
మొన్ననే తొలకరి పలకరించింది. వానరాకతో పుడమి పులకరించింది. రైతు మనసు తేలికైంది. ఎవుసం షురువైంది. సాగుకు దుక్కులు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పంట పెట్టుబడికీ రాష్ట్ర ప్రభుత్వం సాయమూ అందిస్తున్నది.