గుజరాత్లో నకిలీలలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో నకిలీ ప్రభుత్వ కార్యాలయం, నకిలీ టోల్‌ప్లాజాను గుర్తించగా తాజాగా నకిలీ దవాఖాన గుట్టు రట్టయ్యింది.
గుజరాత్లో ఓ నకిలీ ఆఫీస్ ఏర్పాటు చేసి,రూ.4.16 కోట్ల ప్రభుత్వ నిధులు స్వాహా చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సందీప్, అబు బకర్ సయ్యద్‌ను అదుపులోకి తీసుకొన్నట్టు పోలీసులు శనివారం వెల్లడించారు.